భారత్‌ను ఎదుర్కొనేందుకే అణ్యాయుధాలు : పాక్అవసరమైతే భారత్‌పై వినియోగించేందుకు తక్కువ దూర లక్ష్యాలను ఛేదించే అణ్వాయుధాలను తయారు చేసుకున్నామని పాక్ ప్రధాని షాహిద్ అబ్బాసీ వెల్లడించారు. ప్రధాని హోదాలో తొలిసారి అమెరికాలో పర్యటిస్తున్న షాహిద్ అబ్బాసీ.. సెప్టెంబర్ 21న జరిగిన ఆ దేశ మేధోసంస్థ కౌన్సిల్ ఆన్ ఫారిన్ రిలేషన్‌స భేటీలో మాట్లాడారు. భారత కోల్డ్‌స్టార్ట్ సిద్ధాంతాన్ని(cold start doctrine) ఎదుర్కొనేందుకే ఈ అణ్వాయుధాలను రూపొందించామని వెల్లడించారు.
పాకిస్తాన్‌తో యుద్ధమంటూ జరిగితే ఎదుర్కొనేందుకు భారత ఆర్మీ ‘కోల్డ్ స్టార్ట్ సిద్ధాంతం’ను రూపొందించింది. యుద్ధమేఘాలు కమ్ముకున్నప్పుడు పాకిస్తాన్ అణ్వాయుధాలు వినియోగించకుండా భారత బలగాలు నిలువరించే ప్రత్యేక వ్యూహమే ఈ సిద్ధాంతం.
ఐరాస వేదికగా పాక్‌పై భారత్ మండిపాటు ఐక్యరాజ్యసమితి వేదికగా భారత్ మరోసారి పాకిస్తాన్‌పై నిప్పులు చెరిగింది. దాయాదిని ‘టైస్తాన్’ అని ఘాటుగా విమర్శిస్తూ.. అంతర్జాతీయ ఉగ్రవాదానికి పాక్ పుట్టినిల్లుగా మారిందని పేర్కొంది. సెప్టెంబర్ 22న జరిగిన ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో భారత ప్రతినిధి ఈనామ్ గంభీర్ పాకిస్తాన్ తీరును తీవ్రంగా ఎండగట్టారు. ఒసామా బిన్ లాడెన్, ముల్లా ఒమర్ వంటి ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించిన పాక్.. తామే ఉగ్రబాధితులమని చెప్పుకోవటం విడ్డూరంగా ఉందన్నారు. అంతకుముందు ఐరాస సమావేశంలో పాక్ ప్రధాని షాహిద్ అబ్బాసీ ఎల్‌వోసీని దాటివస్తే భారత్‌కు దీటుగా సమాధానమిస్తామంటూ చేసిన వ్యాఖ్యలకు గంభీర్ ఘాటుగా సమాధానమిచ్చారు. కాగా, తమపై ఒత్తిడి పెంచేందుకు భారత ఎన్‌ఎస్‌ఏ అజిత్ దోవల్ రూపొందిస్తున్న వ్యూహాలు విజయవంతం కాకుండా అడ్డుకోగలమని పాకిస్తాన్ పేర్కొంది.
భద్రత కౌన్సిల్‌లో భారత సభ్యత్వానికి భూటాన్ మద్దతుఐక్యరాజ్య సమితి భద్రత కౌన్సిల్‌లో జీ - 4 దేశాలకు (భారత్, జపాన్, బ్రెజిల్, జర్మనీ) శాశ్వత సభ్యత్వానికి భూటాన్ మద్దతు తెలిపింది. సెప్టెంబర్ 22న న్యూయార్క్‌లో జరిగిన ఐరాస సర్వసభ్య సమావేశంలో భూటాన్ ప్రధానమంత్రి షెరింగ్ టాబ్‌గే ఈ మేరకు జీ - 4 దేశాలకు శాశ్వత సభ్య కల్పించాలని కోరారు. ప్రపంచంలో మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఐరాసలోను సంస్కరణలు రావాలని అభిప్రాయపడ్డారు.
పోర్చుగీస్ ప్రధాని ఆంటోని లూయిస్ డా కోస్టా సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
అఫ్గాన్‌కు సైన్యాన్ని పంపబోం: భారత్ అఫ్గానిస్థాన్‌కు తమ బలగాలను పంపేది లేదని అమెరికాకు భారత్ స్పష్టం చేసింది. అయితే అఫ్గాన్ అభివృద్ధికి సంబంధించి సహాయం కొనసాగించేందుకు తాము సిద్ధమని ప్రకటించింది. ఈ మేరకు సెప్టెంబర్ 26న ఢిల్లీలో భారత్, అమెరికా రక్షణ మంత్రులు నిర్మలా సీతారామన్, జేమ్స్ మాటిస్ మధ్య ద్వైపాక్షిక, ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలు, ఉగ్రవాదానికి పాకిస్తాన్ సాయంపై చర్చలు జరిగాయి. అమెరికాతో ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం, ఉగ్రవాదంపై పోరు తదితర అంశాలపై ప్రధాని నరేంద్ర మోదీతోనూ మాటిస్ చర్చించారు.
భారత్ - జపాన్ మధ్య 15 ఒప్పందాలుభారత్ - జపాన్ 12వ వార్షిక సదస్సు గుజరాత్‌లోని గాంధీనగర్‌లో సెప్టెంబర్ 14న జరిగింది. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, జపాన్ ప్రధాని షింజో అబే మధ్య ద్వైపాక్షిక, ప్రాంతీయ, అంతర్జాతీయాంశాలపై చర్చలు జరిగాయి. రక్షణ, వాణిజ్యం, పౌర అణు శక్తి రంగాల్లో సహకారాన్ని పెంచుకునే దిశగా ఇరువురు నేతలు చర్చలు జరిపారు. దీంతోపాటుగా ఇరుదేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని విస్తృతం చేసుకునే దిశగా పౌర విమానయానం, వాణిజ్యం, శాస్త్ర, సాంకేతిక రంగాలకు సంబంధించి 15 ఒప్పందాలు జరిగాయి. చైనా దూకుడు పెరుగుతున్న నేపథ్యంలో ఇండో-పసిఫిక్ ప్రాంతంలో పరస్పర సహకారాన్ని బలోపేతం చేసుకునేందుకు కూడా అంగీకారం కుదిరింది. 2016-17 ఆర్థిక సంవత్సరంలో భారత్‌లో జపాన్ 4.7 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.30వేల కోట్లు) పెట్టుబడులు పెట్టిందని.. గతేడాది కన్నా ఇది 80 శాతం ఎక్కువని ఈ సందర్భంగా మోదీ వెల్లడించారు.
‘రక్షణ’ సహకారానికిభారత్, జపాన్ నిర్ణయంరక్షణ రంగంలో మరింత సహకరించుకోవాలని భారత్, జపాన్ నిర్ణయించాయి. కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ సెప్టెంబర్ 6న జపాన్ పర్యటనలో ఆ దేశ రక్షణ మంత్రి ఇస్తునోరీ ఒనెడేరాతో ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొన్నారు. జపాన్ నౌకా స్థావరంలోని పి-1 హెలికాప్టర్ నమూనాను పరిశీలించారు. జలాంతర్గాములను ధ్వంసం చేసే ఆయుధ సంపత్తి ఉండటం ఈ హెలికాప్టర్ ప్రత్యేకత. జలాంతర్గాముల విధ్వంసక యుద్ధ విధానంలో శిక్షణ ఇవ్వడం పైనా అవగాహన కుదిరింది. రోబోటిక్స్, మానవ రహిత వాహనాలపై సాంకేతిక చర్చలు జరపాలని; నీటిలో, గాలిలో తిరిగే యూఎస్-2ఐ ఉభయచర విమానాల కొనుగోలుపై చర్చించాలని నిర్ణయించాయి.
భారత్, శ్రీలంక నౌకాదళ విన్యాసాలుభారత్, శ్రీలంక సంయుక్త నౌకాదళ విన్యాసాలు సెప్టెంబర్ 7న విశాఖపట్నంలో ప్రారంభమయ్యాయి. ద్వైపాక్షిక ఒప్పందం ప్రకారం రెండు దేశాల మధ్య ఐదో విడత సంయుక్త విన్యాసాలను రెండు పర్యాయాలుగా జరుపుతారు. మొదటి పర్యాయం సెప్టెంబర్ 7 నుంచి 10 వరకు, రెండో పర్యాయం సెప్టెంబర్ 11 నుంచి 14 వరకు నిర్వహిస్తారు.
భారత్-బెలారస్ మధ్య 10 ఒప్పందాలు భారత్ పర్యటనకు వచ్చిన బెలారస్ అధ్యక్షుడు ఏజీ ల్యూకాశెంకో సెప్టెంబర్ 12న ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమై ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఈ సందర్భంగా.. ద్వైపాక్షిక సహకారాన్ని విసృ్తతం చేసుకోవడంతో పాటు ‘మేకిన్ ఇండియా’ కింద ఉమ్మడిగా రక్షణ ఉత్పత్తుల తయారీని ప్రోత్సహించాలని భారత్, బెలారస్‌లు నిర్ణయించాయి. ఈ మేరకు చమురు, వ్యవసాయం, సైన్‌స అండ్ టెక్నాలజీ, విద్య, క్రీడల రంగాల్లో ఇరు దేశాల మధ్య 10 ఒప్పందాలు కుదిరాయి.
భారత్, మయన్మార్ మధ్య 11 ఒప్పందాలు
భారత ప్రధాని నరేంద్ర మోదీ మయన్మార్ పర్యటనలో భాగంగా సెప్టెంబర్ 6న ఆ దేశ ప్రభుత్వ సలహాదారు ఆంగ్‌సాన్ సూచీతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై ఇరువురు నేతలు చర్చలు జరిపారు. అనంతరం.. 11 ఒప్పందాలపై ఇరు దేశాల ప్రతినిధులు సంతకాలు చేశారు. సముద్ర రవాణా, మయన్మార్‌లో ప్రభుత్వ సంస్థల బలోపేతం, ఆరోగ్యం, ఐటీ రంగాలతో పాటు, ఇరు దేశాల ఎన్నికల సంఘాలు, ప్రెస్ కౌన్సిల్స్ మధ్య ఒప్పందాలు కుదిరాయి. వైద్య ఉత్పత్తుల నియంత్రణ, మయన్మార్ మహిళా పోలీసులకు శిక్షణపై కూడా ఇరు దేశాలు ఒప్పందం చేసుకున్నాయి.
మయన్మార్ దేశ ఐక్యతను గౌరవిస్తూ రోహింగ్యాల సమస్య పరిష్కారానికి సంబంధిత పక్షాలన్నీ కలిసికట్టుగా కృషి చేయాలని ఈ సందర్భంగా ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. భారత్‌లో పర్యటించాలనుకునే మయన్మార్ పౌరులకు ఎలాంటి రుసుం లేకుండా వీసాల జారీకి నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.
సూచీకి ప్రత్యేక కానుక..సిమ్లాలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్‌సడ్ స్టడీ(ఐఐఏఎస్)లో ఫెలోషిప్ కోసం 1986లో సూచీ సమర్పించిన పరిశోధన పత్రాల అసలు కాపీల్ని ప్రధాని మోదీ సూచీకి బహుమతిగా ఇచ్చారు. సూచీ ఢిల్లీలోని లేడీ శ్రీరాం కాలేజీలో రాజకీయ శాస్త్రంలో డిగ్రీ పూర్తిచేశారు.
అఫ్గాన్‌లో 116 ప్రాజెక్టులు చేపట్టేందుకు భారత్ సంసిద్ధత వ్యూహాత్మక భాగస్వామి అయిన అఫ్గానిస్తాన్ భద్రతా వ్యవస్థ పటిష్టతకు మరింత సహకారం అందిస్తామని భారత్ స్పష్టం చేసింది. పాకిస్తాన్ నుంచి ఎదురవుతున్న సరిహద్దు ఉగ్రవాద సవాళ్లను ఎదుర్కొనేందుకు విసృ్తత స్థాయిలో కలసి పనిచేయాలని ఇరు దేశాలూ నిర్ణయించినట్టు తెలిపింది. ఈ మేరకు విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మాస్వరాజ్‌తో అఫ్గాన్ విదేశాంగ మంత్రి సలాహుద్దీన్ రబ్బానీ సెప్టెంబర్ 11న భేటీ అయి ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు. అఫ్గాన్‌లో రక్షణ వ్యవస్థ పటిష్టతతో పాటు అక్కడ కొత్తగా 116 అత్యున్నత స్థాయి అభివృద్ధి ప్రాజెక్టులు చేపట్టనున్నట్టు సుష్మా ఈ సందర్భంగా వెల్లడించారు.