Thursday, 28 June 2018

మే 2018 ద్వైపాక్షిక సంబంధాలు

భారత్-చైనాల శిఖరాగ్ర సదస్సు భారత ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ల అనధికార శిఖరాగ్ర సదస్సు ఏప్రిల్ 27న ప్రారంభమైంది. చైనాలోని పర్యాటక కేంద్రమైన వుహాన్‌లో ఇరు దేశాధినేతలు సమావేశమైయ్యారు. హృదయపూర్వక సమావేశం (హార్ట్ టు హార్ట్ సమ్మిట్)గా పేర్కొంటున్న ఈ సదస్సులో ద్వైపాక్షిక, ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై చర్చించారు. రెండు దేశాల అభివృద్ధితో పాటు ప్రపంచ పురోగతిలో కీలక పాత్ర పోషించే సమర్థత భారత్, చైనాలకుందని స్పష్టం చేశారు. 


ఇస్లామాబాద్‌లో నిమ్రానా డైలాగ్’ 
భారత్-పాకిస్తాన్‌ల మధ్య అనధికార రాయబార విధానం పునరుద్ధరణకు భారత ప్రతినిధుల బృందం ఏప్రిల్ 28 నుంచి 30 వరకు పాకిస్తాన్‌లో పర్యటించింది. ఇటీవల భారత్-పాక్‌ల మధ్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్న నేపథ్యంలో ఇస్లామాబాద్‌లో తాజా చర్చలు జరగ్గా, భారత బృందానికి విదేశాంగ శాఖ మాజీ కార్యదర్శి వివేక్ కట్జూ నేతృత్వం వహించారు. ‘నిమ్రానా డైలాగ్’ గా పిలిచే ఈ అనధికార చర్చలు 1990ల్లోనే మొదలయ్యాయి. రాజస్తాన్‌లో ఉండే నిమ్రానా కోటలో తొలిసారి ఈ చర్చలు జరగడంతో వీటికి ఆ పేరు వచ్చింది.



No comments:

Post a Comment